Saturday, 19 December 2015

తీపి గుర్తులు-26

మనిషి మనిషికి ఏమి ఇవ్వగలడు
ఇవ్వాలకున్నది ఆ పైవాడే ఇస్తాడు

Thursday, 19 November 2015

తీపి గుర్తులు-25

మనసుకే రెక్కలు వొచ్చే
మనిషికి ఇంకా రాలేదు

Wednesday, 4 November 2015

తీపిగుర్తులు-24

చివరిమజిలీ ఏదో తెలియని అజ్ఞానిని నేను...
తెలియక నవ్వి తెలిసి ఇప్పుడు నవ్వుతున్నా!

Thursday, 8 October 2015

తీపిగుర్తులు-23


అప్పుడప్పుడు....జీవితం మారడానికి
క్షణాలు చాలు, యుగాలు అక్కరలేదు
కాలాన్ని మార్చడానికి జీవితం సరిపోదు!

Thursday, 1 October 2015

తీపి గుర్తులు-22

కన్నీరు నిండిన కళ్ళలో దాగిన ప్రేమ చూసి
కనేకలలు నిజం కావాలనుకోవడం అవివేకం

Sunday, 30 August 2015

తీపిగుర్తులు-21

కాల్చని మట్టిఇటుకల గోడ ఈ జీవితం
జ్ఞాపకాలే బీటలుగా మారి కూలిపోయె


Saturday, 15 August 2015

తీపిగుర్తులు-20



నువ్వు ప్రేమించి నన్ను ఒంటరిని చేసావు
మనుషుల మధ్యలోనే నన్ను వెలివేసావు..

Wednesday, 5 August 2015

తీపిగుర్తులు-19

కుంచె నుండి రంగులే జాలువారగా
కావ్యనాయకి రూపాన్నిచిత్రిస్తున్నా
కాన్వాసు పై ఆమె కవితలే రాయగా
నేను కాగితం పై కావ్యాన్ని గీస్తున్నా


Saturday, 18 July 2015

తీపిగుర్తులు-18



చినుకులను చూసిన నాకు కన్నీరు ఆగలేదు
వర్షానికి ఆమె జ్ఞాపకాలకి మధ్య సంబంధమిది

Wednesday, 8 July 2015

తీపిగుర్తులు-17

దిగులుగా కూర్చుంటే దిక్కేం తోచేను!?
ధైర్యంగా దూసుకెళితే దశదిశమారును

Thursday, 2 July 2015

-తీపి గుర్తులు-16

గుండె గాయమే ఇంకా మానలేదు..
వెన్నుపోటు కూడా పొడిచావెందుకు?

Thursday, 25 June 2015

తీపిగుర్తులు-15



జీవితమా నీవు ఎంత ఏడిపించాలి అనుకుంటావో
దానికి రెట్టింపు నేను నవ్వుతాను...నీమీద ఒట్టు!

Wednesday, 17 June 2015

తీపిగుర్తులు-14

నిజాలని కలలుగా భావించే మీరు
నిద్రమత్తుని వీడి మేల్కొని చూడండి

Wednesday, 10 June 2015

తీపిగుర్తులు-13

నా ప్రయత్నం ఎప్పుడూ ఫలితాన్ని ఇవ్వలేదు
నిన్ను పొందడంలోనూ, మరచిపోవడంలోను

Tuesday, 2 June 2015

తీపి గుర్తులు -12



అనుకున్నవి అనుకున్నట్లు జరిగితేనే

"అంతా శాంతి" అనుకుంటుంది !

అసలు శాంతి ఎక్కడ దొరుకునో వెదకు

"అంతా శాంతే" అంటుంది అంతర్మధనం!

Sunday, 24 May 2015

తీపి గుర్తులు-11

మనసుని మెలిపెట్టే భాధ...
మనలని మార్చే మరోభాధలో
ఏదైనా...చేసిన వాడికి చేసుకున్నంత
కావాలని కోరుకునే హక్కులో భాధ్యత

Sunday, 17 May 2015

తీపి గుర్తులు-10

నా కలలకి రెక్కలు కట్టి లేపుకుపొమ్మన్నా..కానీ
రేయంతా నిదురపోనీయని చుప్పనాతి కలలని ఏంచేయను

Tuesday, 12 May 2015

తీపి గుర్తులు -9



వెక్కెక్కి వచ్చే వెక్కిళ్ళలో వ్యత్యాసం ఉండాల్సింది
తడవకోమారు ఎవరు తలుస్తున్నారో తెలిసిపోయేది