Monday, 27 April 2015

తీపిగుర్తులు-7



ఒక పని చేయలేము అనుకున్నవారు..
ఆ పని వేరొకరు చేస్తుంటే చెడగొట్టకండి!

Wednesday, 22 April 2015

అసమర్థత

ప్రస్తుతం ఎవ్వరినీ నమ్మేలా లేదు
భయమేస్తుంది ఎవరి చేతుల్లో
మోసపోవడం ఇంకా మిగిలుందోనని
నా సొంతం అనుకున్నవారే
నా ఆందోళనికి కారణం...కానీ
అసలు విషయం ఏమిటంటే
నా అన్నవారు ఎవరో తెలియకనే
నా అసమర్థత చేత నాకే అవమానం

Sunday, 19 April 2015

తీపిగుర్తులు-6



చంద్రుడి పాత్రను మనం పోషిద్దాం...
మచ్చలేమున్నా మనలోనే దాచుకుని
వెలుగంటి మంచిని అందరికీ పంచేద్దాం!

Thursday, 16 April 2015

తీపిగుర్తులు-5

వెక్కిళ్ళొస్తుంటే లోలోన సంబరమే ఎప్పుడూ
నన్ను కూడా తలుచుకునేవారు ఉన్నారని!!

Sunday, 12 April 2015

మనిషి

మనిషి మార్పునే కానీ వారి అలవాట్లని మార్చలేం
మనిషి దూరమైతే వ్యధని ఆపగలం ఊపిరిని ఆపలేం

Wednesday, 8 April 2015

పావురాలు

ఏం సాధించాలి అనుకున్నాం, ఏం సాధించాం?
మందిరాలు కొన్ని, మజీదులు మరికొన్ని కట్టాం!
మనకన్నా పావురాలు నయం...కొన్నిసార్లు మందిరం పై
పలుమార్లు మజీదుల పైన బేధమనేది లేక వాలతాయి.

Sunday, 5 April 2015

తీపి గుర్తులు-3

దేవుడి గుడిలో ధనికుడు అడుక్కుంటే
దరిద్రుడు బయట భిక్షం ఎత్తుకుంటాడు

Friday, 3 April 2015

తీపి గుర్తులు2



కాలం ఆగిపోనూ లేదు, లోకం పోకడా మారలేదు
చెట్టు ఎండిపోయిందని పక్షులే గూడు మార్చాయి.

Thursday, 2 April 2015

తీపి గుర్తులు1





జీవితాన్ని అప్పుడప్పుడూ మోసం చేసి జీవిస్తున్నా

అది నేను చేసిన కర్త కర్మ క్రియలకు బదులిస్తుంటే

ఆచి తూచి మార్చి నేను మళ్ళీ తప్పులు చేస్తున్నా